VIDEO: బస్సు డ్రైవర్ చాకచక్యంతో మహిళ ప్రాణాలు దక్కాయి

VIDEO: బస్సు డ్రైవర్ చాకచక్యంతో మహిళ ప్రాణాలు దక్కాయి

రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇతరుల తప్పిదం కూడా ప్రమాదానికి కారణమవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, ఒక బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు.

వీడియోలో, ఒక మహిళ రోడ్డును దాటే ప్రయత్నంలో ఉంది. కానీ, దూసుకొచ్చే బస్సును ఆమె గుర్తించలేదు. అయితే, డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి కచ్చితమైన సమయానికి బ్రేక్ వేశాడు. బస్సు అతికొద్ది దూరంలో ఆగిపోయింది, దాంతో షాక్‌కు గురైన ఆ మహిళ డ్రైవర్‌ను చూసి ఏదో కోపంగా మాట్లాడి ముందుకు వెళ్లిపోయింది.

View this post on Instagram

A post shared by Manohar R (@manoharhandpost)

ఈ సంఘటన కర్ణాటకలో జరిగిందని సమాచారం. జనవరి 25న ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఇప్పటివరకు 69 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించి, బస్సు డ్రైవర్ చాకచక్యాన్ని కొనియాడుతున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *