IPL 2025 ఆరంభం: క్రికెట్ మేళా మొదలు!

అయిదు నెలల నిరీక్షణకు తెరదించుతూ క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన IPL-2025 ఇప్పుడు ఆరంభం కానుంది. ఇప్పటికే అద్భుతమైన ఓపెనింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రముఖ గాయకులు, సంగీత దర్శకుడు అనిరుధ్ అదిరిపోయే ప్రదర్శన ఇవ్వనున్నారు. స్టేడియంలో టపాసుల మోతలతో పాటు అభిమానుల హర్షధ్వానాలు మారుమోగుతున్నాయి. ఈ క్రికెట్ పండుగ వచ్చే రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించనుంది.
ఈ రోజు రాత్రి 7:30 గంటలకు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. గత గెలుపోటముల రికార్డులను పక్కన పెడితే, ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరు జట్టుకా? లేక కోల్కతా విజృంభించనుందా? క్రికెట్ ప్రేమికులందరి దృష్టి ఈ థ్రిల్లింగ్ సమరంపై ఉంది. మీ అభిప్రాయం ఏంటీ? ఈ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారని మీరు అనుకుంటున్నారు? COMMENT!