CUET UG దరఖాస్తు గడువు పెంపు

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించింది. అభ్యర్థులకు మరింత సమయం కల్పిస్తూ, ఈనెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఈ పరీక్ష ద్వారా సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 26 నుండి 28వ తేదీ వరకు దరఖాస్తును సవరించుకునే వీలును కల్పించారు. పరీక్షలు మే 8 నుంచి జూన్ 1 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష 13 భాషల్లో నిర్వహించబడేలా ఏర్పాట్లు చేశారు. CUET UG ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులకు ఇది మంచి అవకాశం కానుంది. కావున, ఆసక్తి కలిగిన అభ్యర్థులు గడువు ముగిసే లోపు దరఖాస్తు పూర్తి చేసుకోవాలి.