వాషింగ్ మెషిన్లో దుస్తులతో పాటు ఈ వస్తువు పెట్టి ఊహించని షాక్.. వీడియో వైరల్
September 18, 2025

స్పెయిన్లోని ఒక లాండ్రోమాట్లో ఉన్న వాషింగ్ మెషీన్లో భారీ పేలుడు సంభవించి ఆ పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి మెషిన్ నుండి బయటకు రాగానే పేలుడు జరిగింది. దీంతో ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు.
ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, పేలుడుకు ఒక సిగరెట్ లైటర్ కారణం అని భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు అరుదుగా జరుగుతాయి, కానీ ఈ ఘటన ఒక పెద్ద హెచ్చరికగా భావించవచ్చు. దుస్తులను వాషింగ్ మెషిన్లో వేసే ముందు జేబులను సరిగ్గా తనిఖీ చేయడం చాలా ముఖ్యం, దీనివల్ల ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు.