శారీరక వైకల్యం ఉన్నా, జీవితంలో పోరాడి గెలిచిన గుజరాత్ యువతి వందన!

శారీరక వైకల్యం ఉన్నా, జీవితంలో పోరాడి గెలిచిన గుజరాత్ యువతి వందన!

గుజరాత్ లోని రాజ్‌కోట్ కు చెందిన వందన, శారీరక వైకల్యం ఉన్నప్పటికీ, ఆమె అనేకమందికి ఒక గొప్ప ప్రేరణగా నిలిచారు. ఆమె శరీరం 80% పనిచేయకపోయినా, ఆమె ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తున్నారు. జెట్‌పూర్‌లోని ఒక కంప్యూటర్, జిరాక్స్ షాప్ ను ఆమె తన కాళ్లతో నడుపుతూ, తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆమె దృఢ సంకల్పం, కష్టపడే మనస్తత్వం ఎంత గొప్పదో ఆమె జీవితం రుజువు చేసింది.

వందన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు వీరాభిమాని. ఆమె నిరంతరం ఆయనకు ఉత్తరాలు రాస్తుంటారు, వాటికి బచ్చన్ కుటుంబం నుంచి ఆమెకు బదులు కూడా వస్తుంటుంది. ఆమె పనితీరుకు ముగ్దుడై, అమితాబ్ బచ్చన్ స్వయంగా ఆమెను ప్రోత్సహిస్తూ ఉత్తరాలు రాశారు. వందన జీవిత ప్రయాణం నిరాశతో ఉన్న అనేకమందికి ఒక గొప్ప ప్రేరణ అని చెప్పవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *