పని తప్పించుకోవడానికి చెల్లి ట్రిక్ ఫాలో అయిన అన్న, షాకైన తల్లి!
September 17, 2025

ఇంట్లో పనులనుండి తప్పించుకోవడానికి ఒక అన్న, తన చెల్లి ట్రిక్‌ను ఫాలో అయిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. వీడియోలో, ఇంట్లో పనులు చేయమని తల్లి కూతురిని అడగగా, ఆమె నెయిల్ పాలిష్ వేసుకునే నెపంతో పనిని తప్పించుకుంటుంది. దాంతో తల్లి ఆ పనులన్నింటినీ కొడుకుతో చేయిస్తుంది.
చివరకు, బట్టలు తీసుకురామని అడగగా, తెలివైన కొడుకు కూడా తన చెల్లిని అనుకరించి, తన చేతులకు నెయిల్ పాలిష్ వేసుకుంటాడు. పనినుండి తప్పించుకోవడానికి కొడుకు అనుసరించిన ఈ పద్ధతి చూసి తల్లి ఆశ్చర్యపోతుంది. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను బాగా నవ్విస్తోంది. అన్న చెల్లెళ్ళ మధ్య ఉన్న ఈ స్నేహం అందరినీ ఆకట్టుకుంటోంది.