ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్‌డిఎ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్‌డిఎ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్‌డిఎ కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పేరును బిజెపి ప్రకటించింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఈ ప్రకటన చేశారు.

రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం, నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయిన ఆగస్టు 21న రాధాకృష్ణన్ తన నామినేషన్ పత్రాలను సమర్పించే అవకాశం ఉంది. తమిళనాడులోని కోయంబత్తూరు నుండి రెండుసార్లు లోక్‌సభ ఎంపిగా, జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన రాధాకృష్ణన్‌పై ఎన్‌డిఎ విశ్వాసం ఉంచింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *