‘గంగమ్మ తల్లి స్వయంగా వచ్చారు’! వరదల్లో చిక్కుకున్న గ్రామంలో యోగి మంత్రి విచిత్రమైన వ్యాఖ్య
August 6, 2025

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని 17 జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించాయి, దీంతో 400కు పైగా గ్రామాలు నీట మునిగాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాన్పూర్‌లోని వరద ప్రభావిత గ్రామాన్ని సందర్శించిన మంత్రి సంజయ్ నిషాద్, సహాయం అందడం లేదని ఫిర్యాదు చేసిన గ్రామస్తులకు విచిత్రమైన వివరణ ఇచ్చారు.
“గంగమ్మ తల్లి స్వయంగా వచ్చారు, ఆమె దర్శనంతో పిల్లలకు స్వర్గం లభిస్తుంది” అని సంజయ్ నిషాద్ అన్నారు. మంత్రి చేసిన ఈ వ్యాఖ్యపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతపరమైన భావాలను ఉపయోగిస్తోందని చాలామంది ఆరోపించారు. ఇంతటి ఘోరమైన ప్రకృతి వైపరీత్యాన్ని దేవతలతో పోల్చడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.