భారత్ చర్యతో పాకిస్థాన్‌లో కలకలం

భారత్ చర్యతో పాకిస్థాన్‌లో కలకలం

ఇటీవల వరల్డ్ క్రికెట్ లీగ్ (WCL)లో భారత్ మ్యాచ్ బహిష్కరించిన తర్వాత, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ ప్రతిష్ట దెబ్బతింది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) దేశం పేరు, జెండా ఉపయోగించి నిర్వహించే ప్రైవేట్ క్రికెట్ లీగ్‌లకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంది. ఈ తరహా లీగ్‌లు దేశ గౌరవానికి భంగం కలిగిస్తున్నాయని PCB పేర్కొంది.

PCB వర్గాల ప్రకారం, ఇకపై ఏ ప్రైవేట్ టోర్నమెంట్‌లోనూ పాకిస్థాన్ పేరు వాడరాదు. ఇది అంతర్జాతీయ స్థాయిలో దేశ గౌరవం, క్రికెట్ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ నిర్ణయం తర్వాత పాకిస్తాన్ అంతటా విస్తృత చర్చ జరుగుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *