తెలంగాణ, భారీ వర్షాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణ, భారీ వర్షాలకు ఆరెంజ్ అలర్ట్

తెలంగాణలో రాగల ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది.

మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. మిగిలిన పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *