బయ్యా సన్నీ యాదవ్‌పై లుక్ఔట్ నోటీసులు
March 22, 2025

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌పై పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు నిర్వహించిన విచారణలో అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడు ఎక్కడ కనిపించినా వెంటనే సమాచారం అందించాల్సిందిగా ప్రజలను కోరారు.
సన్నీ యాదవ్‌పై సూర్యాపేట జిల్లాలోని నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనపై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో బెటింగ్ యాప్స్‌కు ప్రచారం చేయడమే కాకుండా, వాటిని ఉపయోగించేందుకు ప్రజలను ప్రేరేపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం సేకరించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశముంది.