ఇన్‌స్టా లైవ్‌లో భర్త ఉరి.. వీడియో చూసినా పట్టించుకోని భార్య

ఇన్‌స్టా లైవ్‌లో భర్త ఉరి.. వీడియో చూసినా పట్టించుకోని భార్య

మధ్యప్రదేశ్ రేవా జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. శివ్ ప్రకాశ్ (26) అనే యువకుడు తన భార్య, అత్త వేధింపులు తట్టుకోలేక ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషాదకరమైన విషయం ఏమిటంటే, అతని భార్య ప్రియాశర్మ లైవ్ వీడియో 44 నిమిషాల పాటు చూస్తూనే ఉండిపోయింది కానీ భర్తను కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ ఘటన అతని కుటుంబ సభ్యులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.

ఈ విషయంలో బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో ప్రియాశర్మకు వివాహేతర సంబంధం ఉందని, ఈ కారణంగానే దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో అతని భార్య ప్రియాశర్మ, అత్తను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *