నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్
March 22, 2025

తాను సనాతన ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను గౌరవిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ కులం, మతం పాటించలేదని చెప్పారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలోని బుడగ జంగాలకు న్యాయం చేస్తాం. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించా. ఇకపై ప్రతి జిల్లాలో పర్యటిస్తా. క్యాంపు ఏర్పాటు చేసుకుని ప్రజా సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తా’ అని ఆయన వ్యాఖ్యానించారు.