కేకేఆర్ టీమ్‌కు షారుఖ్ ఖాన్ సందేశం

డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు ఈరోజు తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జట్టు యజమాని, ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ఆటగాళ్లకు మద్దతుగా నిలిచిన షారుఖ్, వాళ్ల ఆరోగ్యం, ఆనందం గురించి ఆకాంక్షిస్తూ, జట్టుగా ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
“మీ అందరిపై దేవుడి కరుణ ఉండాలి. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. ఈ సీజన్‌లో మీ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నా. మన జట్టును బాగా చూసుకుంటున్న చంద్రకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జట్టులో కొత్తగా చేరిన ఆటగాళ్లకు హృదయపూర్వక స్వాగతం. మనల్ని ఈ సీజన్‌లో నడిపించనున్న అజింక్యకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ టీమ్ మీకు ఒక కుటుంబంగా, ఇంటిలా అనిపించాలి” అని షారుఖ్ భావోద్వేగంతో అన్నారు.
ఈ మాటలు కేకేఆర్ ఆటగాళ్లను మరింత ఉత్సాహపరిచాయి. తాజా సీజన్‌లో బలమైన ప్రదర్శన ఇవ్వాలని జట్టు సభ్యులు సిద్ధమవుతున్నారు. షారుఖ్ సందేశం వారిలో నమ్మకాన్ని పెంచడంతో పాటు, కొత్త ఉత్సాహాన్ని నింపిందని భావిస్తున్నారు.