IPL: ఆ జట్టుకు అదిరిపోయే న్యూస్
May 15, 2025

ఎల్లుండి నుంచి IPL పున: ప్రారంభం కానుండగా RCB జట్టులో కీలక ప్లేయర్ చేరనున్నారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయిన రొమారియో షెఫర్డ్ తిరిగి ఇండియాకు పయనమయ్యారు. ఈ సీజన్లో 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఇతను జట్టులో చేరడం ఆర్సీబీకి కీలకంగా మారనుంది. ఇతనితో పాటు నరైన్, రసెల్ కూడా తిరిగి KKR జట్టులో చేరనున్నారు. ఈ మేరకు వీళ్లు ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.