రాత్రి చపాతి తింటే లాభమా? నష్టమా?
March 26, 2025

బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది రాత్రి భోజనంగా చపాతిని ఎంపిక చేసుకుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? అంటే, వైద్యుల ప్రకారం, కచ్చితంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో జీర్ణవ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతుంది. చపాతిలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు కాస్త ఎక్కువ సమయం తీసుకుని జీర్ణమవుతాయి. దీంతో త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది, భోజన మధ్య వ్యత్యాసం పెరిగి అధిక కేలరీలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.
అదే సమయంలో, చపాతిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. అయితే, మితంగా తినడం ముఖ్యం. అధిక పరిమాణంలో చపాతీలు తింటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సమతుల్యమైన ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం.