ఫీల్డింగ్, ఛేజింగ్ లో తప్పిదాలే మా ఓటమికి కారణం: గిల్
March 26, 2025

పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరిగిన మ్యాచ్‌లో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయామని గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన గిల్, తమ బౌలింగ్, ఫీల్డింగ్‌లో తప్పిదాలు జరిగాయని, అదే ఓటమికి కారణమని తెలిపారు. ‘మేం చాలా పరుగులు ఇచ్చేశాం. ఫీల్డింగ్‌లోనూ అనేక తప్పిదాలు చేశాం. ఛేజింగ్‌లో మొదటి మూడు ఓవర్లు, ఇన్నింగ్స్ మధ్యలో మరో మూడు ఓవర్లలో తక్కువ పరుగులు చేసినందుకే మ్యాచ్‌ను కోల్పోయాం’ అని అన్నారు.
పంజాబ్ బౌలర్ వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేసినట్లు గిల్ కొనియాడాడు. ‘అతను యార్కర్లతో చాలా చక్కటి బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా 15 ఓవర్ల తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి అలా బౌలింగ్ చేయడం అంత తేలికైన విషయం కాదు’ అని ప్రశంసించాడు. GT జట్టుగా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని, తప్పిదాల నుంచి నేర్చుకోవాలని గిల్ అభిప్రాయపడ్డాడు.