చరణ్ బర్త్ డే గిఫ్ట్: ‘RC16’ గ్లింప్స్ రెడీ!
March 26, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ రెడీ అయ్యింది. ఆయన హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘RC16’ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ గ్లింప్స్ పనులు పూర్తయ్యాయని, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దీనికి సాలిడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నట్లు సమాచారం.
రేపు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ ట్రీట్‌ను విడుదల చేసి, అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, గ్లింప్స్ విడుదల అభిమానులను మరింత ఉత్సాహంలో ముంచేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.