శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు

శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు

IPLలో శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు నెలకొల్పారు. రెండు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున కెప్టెన్‌గా తన తొలి మ్యాచులోనే 90కి పైగా స్కోర్ చేసిన మొదటి క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 93 రన్స్ చేసిన అయ్యర్, తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 రన్స్ చేసి ఈ ఘనత సాధించారు.

ఆఖరి ఓవర్లో శశాంక్ సింగ్‌కు స్ట్రైక్ ఇచ్చేందుకు సెంచరీ అవకాశాన్ని త్యజించడమూ అతని జట్టుకు కలిసి వచ్చింది. ఆ ఓవర్లో 23 పరుగులు రావడంతో మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గెలుచుకుంది. శ్రేయస్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *