బాలీలో ఘోర ప్రమాదం! నటి నుస్రత్ బరూచాకు తీవ్ర గాయాలు, ఎయిర్ అంబులెన్స్‌‌లో ముంబైకి తరలింపు

బాలీలో ఘోర ప్రమాదం! నటి నుస్రత్ బరూచాకు తీవ్ర గాయాలు, ఎయిర్ అంబులెన్స్‌‌లో ముంబైకి తరలింపు

ఇండోనేషియాలోని బాలీలో జరిగిన ఒక ప్రమాదంలో బాలీవుడ్ నటి నుస్రత్ బరూచా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె వెన్నుముకకు తీవ్ర గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం శుక్రవారం రాత్రి ఎయిర్ అంబులెన్స్‌లో ఆమెను అత్యవసరంగా ముంబైకి తరలించారు.

నటికి త్వరలోనే వెన్నుముక శస్త్రచికిత్స (స్పైన్ సర్జరీ) చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంబులెన్స్ నుంచి ఆమెను స్ట్రెచర్‌పై దింపుతున్న వీడియో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *