IPL 2025 ప్రారంభం: గూగుల్ ప్రత్యేక డూడుల్
March 22, 2025

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఈ రోజు ఘనంగా ప్రారంభం కానుండడంతో, గూగుల్ ప్రత్యేకంగా తన డూడుల్‌ను మార్చింది. క్రికెట్ ప్రియుల కోసం రూపొందించిన ఈ డూడుల్‌లో క్రికెట్ పిచ్‌తో పాటు, రెండు డక్స్ ఆడుతున్నట్లు చూపించారు. గూగుల్ తరచుగా విశేషమైన సందర్భాల్లో ప్రత్యేక డూడుల్‌ను రూపొందించగా, ఈసారి క్రికెట్ ప్రేమికుల కోసం దీన్ని రూపొందించడం ఆసక్తికరంగా మారింది.
ఇక IPL 2025 తొలి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు మైదానంలో తలపడనున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 34 సార్లు ఎదురెదురుగా తలపడగా, 20 మ్యాచుల్లో KKR విజయం సాధించగా, 14 మ్యాచులు RCB గెలుచుకుంది. ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారో వేచిచూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తెలియజేయండి!