బీఆర్ఎస్ వీడను: మల్లారెడ్డి స్పష్టం
March 22, 2025

బిఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని వస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులు, మెడికల్, ఇంజినీరింగ్ విద్యాసీట్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్టు తెలిపారు. ఈ భేటీకి ఇతర అర్థం పట్టుకోవద్దని కోరారు.
కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తమ కుటుంబం నుంచి నలుగురు బీఆర్ఎస్ తరఫున పోటీకి సిద్ధమని తెలిపారు. జమిలి ఎన్నికలు జరిగితే ఎంపీగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. పార్టీ మారే ఉద్దేశం లేదని, భవిష్యత్తులోనూ బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.