అల్లు అర్జున్ సరసన టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న అనుష్క శర్మ

చాలా కాలం విరామం తర్వాత బాలీవుడ్ నటి అనుష్క శర్మ వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఆమె నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో అనుష్క తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో దీపికా పదుకొణె, రష్మిక మందన్న వంటి అగ్ర నటీమణులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ప్రేక్షకులు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గత కొన్నేళ్లుగా లండన్‌లో గడుపుతున్న అనుష్క, ఈ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. చిత్రబృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, ఏప్రిల్ 8న అట్లీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ మరియు అనుష్క శర్మల కలయిక బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.