వంటగ్యాస్ ధరల పెరుగుదలపై భగ్గుమన్న ప్రజలు

వంటగ్యాస్ ధరల పెరుగుదలపై భగ్గుమన్న ప్రజలు

పెరుగుతున్న వంటగ్యాస్, పెట్రోల్ మరియు నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా హయత్ నగర్ తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన కార్యక్రమం జరిగింది. సిపిఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ఈ ఆందోళనలో సామాన్యులపై పడుతున్న ఆర్థిక భారాన్ని ఎండగట్టారు. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

హయత్ నగర్ మండల సహాయ కార్యదర్శి మారి శోభన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి సామ్యిది శేఖర్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు 400 రూపాయలుగా ఉన్న గ్యాస్ ధర నేడు 1000 రూపాయలకు చేరిందని, తాజాగా మరో 60 రూపాయలు పెంచడం ప్రజలను దారుణంగా వంచించడమేనని ఆయన విమర్శించారు.

ఈ ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. అనంతరం హయత్ నగర్ తహశీల్దార్ జానకికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి బోయపల్లి రాములు గౌడ్, ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీ వర్ధన్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యుడు అరుణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *