విప్రజ్ నిగమ్.. ఐపీఎల్ హీరో!

2025 ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్లోనే యువకుడు విప్రజ్ నిగమ్ అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన ఈ 20 ఏళ్ల లెగ్-స్పిన్నర్, తన టీమ్కు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. లక్నో సూపర్ జెయింట్స్పై జరిగిన ఈ మ్యాచ్లో విప్రజ్ బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ తన ప్రతిభను చాటుకున్నాడు. మొదట, ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ వికెట్ తీసి ప్రారంభ ప్రభావం చూపాడు. తర్వాత, 15 బంతుల్లో 39 పరుగుల థ్రిల్లింగ్ ఇన్నింగ్స్ ఆడి, ఢిల్లీకి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
విప్రజ్ నిగమ్ ఇటీవలే ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 50 లక్షలకు కొనుగోలు చేసింది. ఉత్తరప్రదేశ్ క్రికెట్ టీమ్ తరఫున సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, యూపీ టీ-20 లీగ్లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన ఈ యువకుడు, ఐపీఎల్లో కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. అతని ఈ థ్రిల్లింగ్ ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆకర్షించింది. భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో విజయం సాధిస్తాడని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.