మార్చి 1 నుండి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ వినియోగదారులకు కొత్త నిబంధనలు

మార్చి 1 నుండి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ వినియోగదారులకు కొత్త నిబంధనలు

సైబర్ నేరాలను అరికట్టేందుకు మార్చి 1 నుండి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ వంటి యాప్‌లకు కేంద్ర ప్రభుత్వం ‘సిమ్ బైండింగ్’ నిబంధనను అమలు చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం, ఖాతాకు అనుసంధానించబడిన సిమ్ కార్డ్ ఫోన్‌లో యాక్టివ్‌గా లేకుంటే సదరు యాప్‌లు పనిచేయవు. టెలికాం విభాగం ఇచ్చిన 90 రోజుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుండటంతో, ఈ మార్పులు మార్చి మొదటి తేదీ నుండి అమల్లోకి వస్తాయి.

భద్రత దృష్ట్యా వెబ్ మరియు డెస్క్‌టాప్ వెర్షన్‌లు ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతాయి. వినియోగదారులు తిరిగి లాగిన్ అవ్వడానికి క్యూఆర్ కోడ్ లేదా ఫోన్ వెరిఫికేషన్ తప్పనిసరి. డిజిటల్ భద్రతను పటిష్టం చేయడానికి మరియు ఆర్థిక మోసాలను నివారించడానికి ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *