కాంతార దైవ నృత్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రణవీర్ సింగ్ కు హైకోర్టులో చుక్కెదురు

కాంతార దైవ నృత్యంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రణవీర్ సింగ్ కు హైకోర్టులో చుక్కెదురు

దక్షిణాది చిత్రం ‘కాంతార’లోని దైవ నృత్యాన్ని ఎగతాళి చేసిన బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదంలో నమోదైన ఎఫ్ఐఆర్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ, న్యాయమూర్తి ఎం నాగప్రసన్న ఆయన బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా మందలించారు.

కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచే సెలబ్రిటీలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోర్టు పేర్కొంది. మిమిక్రీ లేదా వినోదం పేరుతో ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *