కన్నతల్లి కంటే మతమే మిన్న 22 ఏళ్ల తర్వాత ఎదురైన తల్లిని తిరస్కరించిన కొడుకు
February 24, 2026

కోల్‌కతా షెల్టర్ హోమ్‌లో ఉన్న 62 ఏళ్ల సుశీల ముర్మును హ్యామ్ రేడియో సాయంతో బీహార్‌లోని ఆమె కొడుకు వద్దకు చేర్చే ప్రయత్నం జరిగింది. 22 ఏళ్ల తర్వాత వీడియో కాల్‌లో అమ్మను చూసిన కొడుకు, ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు.
తల్లి క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతంలోకి మారితేనే ఇంట్లోకి రానిస్తానని కొడుకు తెగేసి చెప్పాడు. మానవత్వం కంటే మతానికే ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఘటనపై హ్యామ్ రేడియో ప్రతినిధులు పోలీసులను, పరిపాలన యంత్రాంగాన్ని ఆశ్రయించారు.