శ్రీదేవి భయపడినట్లే జరిగింది అతిలోక సుందరి జ్ఞాపకాల్లో అభిమానులు
February 24, 2026

భారతీయ సినీ దిగ్గజం శ్రీదేవి వర్ధంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆమెను స్మరించుకుంటున్నారు. దుబాయ్లో జరిగిన ఆమె ఆకస్మిక మరణం భారత చిత్ర పరిశ్రమలో ఎన్నటికీ పూడ్చలేని లోటును మిగిల్చింది. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆమె జ్ఞాపకాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి.
తన కుమార్తెలు సినిమాల్లోకి రావడంపై శ్రీదేవి అప్పట్లో కొంత ఆందోళన వ్యక్తం చేసేవారు. తనతో వారిని పోల్చి చూస్తారని, అది వారిపై ఒత్తిడి పెంచుతుందని ఆమె భయపడేవారు. ఇప్పుడు జాన్వీ, ఖుషీ కపూర్లు నటీమణులుగా మారడంతో, శ్రీదేవి గతంలో దేని గురించి అయితే భయపడ్డారో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.