ఇరాన్ యుద్ధానికి ముందే యూఎస్ యుద్ధనౌకలో టాయిలెట్ తిప్పలు
February 24, 2026

ఇరాన్‌తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అమెరికా నౌకాదళం ఊహించని సమస్యను ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధనౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌లో మురుగునీటి వ్యవస్థ విఫలమైంది. నౌకలోని ६५० టాయిలెట్లలో మెజారిటీ పనిచేయకపోవడంతో అందులోని ৪৫০০ మంది సైనికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం టాయిలెట్ల కోసం సైనికులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.
వ్యాక్యూమ్ ఆధారిత సివరేజ్ సిస్టమ్‌లో పైపులు మూసుకుపోవడంతో ఈ సమస్య తలెత్తింది. నిపుణులు రోజుకు ১৯ గంటలు శ్రమిస్తున్నా వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదు. వెనిజులా ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన ఈ నౌక ప్రస్తుతం ఇరాన్ సమీపంలో మోహరించి ఉన్నప్పటికీ అంతర్గత నిర్వహణ లోపాలతో సతమతమవుతోంది. ప్రతిసారి క్లీనింగ్ కోసం లక్షలాది డాలర్లు ఖర్చవుతుండటం గమనార్హం.