మరిది ముందే తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం మరియు వీడియో తీసి వేధింపులు
February 24, 2026

ఉత్తరాఖండ్లో మేళా చూసి తిరిగి వస్తున్న ఒక మహిళను ముగ్గురు వ్యక్తులు మరిది ముందే తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన ఆమెపై పదునైన ఆయుధాలతో దాడి చేసి ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.
రాంపూరా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులు మరిదికి తెలిసిన వారే కావడంతో అతడిని కూడా విచారిస్తున్నారు. బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.