డాక్టర్ కావాలని ఒత్తిడి చేసిన తండ్రిని చంపి ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిన కుమారుడు
February 24, 2026

లక్నోలోని ఆషియానాలో కెరీర్ విషయంలో తలెత్తిన వివాదం తండ్రి హత్యకు దారితీసింది. కొడుకు అక్షత్ ప్రతాప్ సింగ్ నీట్ పరీక్ష రాసి డాక్టర్ కావాలని తండ్రి మన్వేంద్ర సింగ్ ఒత్తిడి చేయడంతో ఆగ్రహించిన కుమారుడు తండ్రిని కాల్చి చంపాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా శవాన్ని ముక్కలుగా నరికి నీలం రంగు డ్రమ్ములో దాచిపెట్టాడు.
పోలీసుల విచారణలో తన సోదరి ముందే నిందితుడు శవాన్ని ముక్కలు చేసినట్లు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తండ్రి కనిపించడం లేదన్న ఫిర్యాదుతో సోదాలు చేసిన పోలీసులకు ఇంట్లోనే మృతదేహ భాగాలు లభ్యమయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలతో కేసును దర్యాప్తు చేస్తున్నారు.