మీ ఆస్తుల వివరాలు వెల్లడిస్తారా స్టాలిన్‌కు విజయ్ బహిరంగ సవాల్
February 23, 2026

వేలూరు బహిరంగ సభలో టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు. అధికారంలోకి రాకముందు, వచ్చాక స్టాలిన్ కూడబెట్టిన ఆస్తుల వివరాలను బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. అవినీతిపై తాను పోరాడుతుండటం వల్లే ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుంటోందని విజయ్ ఆరోపించారు.
అందరూ మిత్రులే అన్న స్టాలిన్ వ్యాఖ్యలను విజయ్ తప్పుబట్టారు. మిత్రులైతే తన పార్టీ సభలకు ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు. తమిళనాడును ‘సూపర్ స్టార్ స్టేట్’ చేస్తామన్న హామీలు అబద్ధమని, రాబోయే ఎన్నికలు అవినీతి శక్తులకు, ప్రజలకు మధ్య జరిగే యుద్ధమని ఆయన పేర్కొన్నారు. తమది స్వచ్ఛమైన శక్తి అని, డీఎంకే దుష్టశక్తి అని విజయ్ ఘాటుగా విమర్శించారు.