డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ ఇచ్చిన యూరోపియన్ యూనియన్
February 23, 2026

అమెరికా కొత్త సుంకాల విధానంపై సందిగ్ధత నెలకొనడంతో వాణిజ్య ఒప్పంద ప్రక్రియను యూరోపియన్ యూనియన్ తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుంచి పన్ను విధానాలపై మరిన్ని వివరాలను ఈయూ కోరింది.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, అమెరికా సుంకాలపై స్పష్టత వచ్చే వరకు ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లలేమని ఈయూ స్పష్టం చేసింది. ప్రస్తుత తరుణంలో సరైన సమాచారం కోసం వేచి చూడటం తప్ప తమకు మరో మార్గం లేదని యూరోపియన్ యూనియన్ పేర్కొంది.