తెలివితేటలకు ఏ పాలు మంచివి రాజస్థాన్ మంత్రి వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం
February 23, 2026

దేశీ ఆవు పాలు పిల్లల మేధస్సును పెంచుతాయని ఎనుము పాలు వారిని సోమరిపోతులుగా మారుస్తాయని రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆవు దూడలు చాలా చురుగ్గా ఉంటాయని అది అవి తాగే పాల ప్రభావమేనని ఆయన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై వైద్య నిపుణులు మరియు పోషకాహార నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆవు పాలు తాగడం వల్ల తెలివితేటలు పెరుగుతాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వారు స్పష్టం చేశారు. కేవలం పాలలోని కొవ్వు శాతం మేధస్సుపై ప్రభావం చూపదని వారు వివరించారు.