అభిషేక్ శర్మ బ్యాటింగ్ టెక్నిక్‌పై మహ్మద్ ఆమిర్ యూటర్న్
February 23, 2026

టీ20 ప్రపంచకప్‌లో వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను ‘స్లాగర్’ అని విమర్శించిన పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ తాజాగా తన మాట మార్చాడు. అభిషేక్ కేవలం పవర్ హిట్టింగ్‌పైనే ఆధారపడతాడని, అతడికి సరైన టెక్నిక్ లేదని ఆమిర్ చేసిన వ్యాఖ్యలు గతంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమిర్‌పై నిప్పులు చెరిగారు.
అయితే అభిషేక్ నైపుణ్యాన్ని తాను తక్కువ చేయలేదని, కేవలం ఒక సీనియర్‌గా సలహా ఇచ్చానని ఆమిర్ వివరణ ఇచ్చాడు. సౌతాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడంలో అభిషేక్ ఇబ్బంది పడటం తనను ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నాడు. ప్రత్యర్థులు అభిషేక్ బలహీనతను పసిగట్టారని, అతను తన టెక్నిక్‌ను మెరుగుపరుచుకుని ఓపికగా ఆడితేనే మళ్లీ ఫామ్‌లోకి రాగలడని ఆమిర్ చెప్పుకొచ్చాడు.