కొడైకెనాల్లో తెలంగాణ వ్యాపారవేత్త దారుణ హత్య వెనుక సంచలన పగ ప్రతీకారాలు
February 23, 2026

ప్రముఖ పర్యాటక కేంద్రం కొడైకెనాల్లోని తన సొంత బంగళాలో తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త సూర్యనారాయణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున చొరబడిన దుండగులు ఆయనను కుర్చీకి కట్టేసి, నోటికి ప్యాకింగ్ టేపులు వేయడంతో ఊపిరాడక మరణించారు. మృతుడు సినీ నటి విష్ణుప్రియ తండ్రిగా గుర్తించడంతో ఈ ఘటన రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర కలకలం సృష్టించింది.
పాత కక్షల నేపథ్యంలోనే ఈ పక్కా ప్లాన్ ప్రకారం హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో విష్ణుప్రియ సన్నిహితుడైన ప్రభాకరన్ హత్య కేసులో సూర్యనారాయణపై ఆరోపణలు ఉండటమే దీనికి కారణమని అనుమానిస్తున్నారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తుండగా, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.