హెల్మెట్ లేని వాహనదారులకు హైదరాబాద్ పోలీసుల అదిరిపోయే బంపర్ ఆఫర్
February 23, 2026

రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘హెల్మెట్ బ్యాంక్’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ వద్ద ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానంలో, హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారికి జరిమానాతో పాటు తక్షణ రక్షణ కోసం హెల్మెట్ అందజేస్తారు. వాహనదారుల్లో చైతన్యం నింపడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
ఈ సదుపాయం పొందిన వారు తమ వివరాలను పోలీసులకు సమర్పించి, 24 గంటల్లోగా సొంతంగా కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి పాతది తిరిగి ఇచ్చేయాలి. గడువులోగా స్పందించని వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారు. మల్కాజ్గిరి ట్రాఫిక్ పరిధిలో మొదలైన ఈ కాన్సెప్ట్ విజయవంతమైతే నగరం మొత్తం విస్తరించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.