ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ వైమానిక దాడుల బీభత్సం మహిళలు పిల్లలతో సహా 28 మంది మృతి
February 23, 2026

పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని పక్తికా, ఖోస్ట్ ప్రావిన్సులపై అర్ధరాత్రి మెరుపు దాడులు చేసింది. టీటీపీ స్థావరాలే లక్ష్యంగా జరిగిన ఈ బాంబుల వర్షంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఆఫ్ఘన్ సార్వభౌమత్వానికి మద్దతు ప్రకటించింది.
పవిత్ర రంజాన్ మాసంలో పౌరుల మరణంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ భూభాగంపై జరిగిన ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.