20 సార్లు తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ జైషే కమాండర్ సైఫుల్లా హతం

20 సార్లు తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ జైషే కమాండర్ సైఫుల్లా హతం

జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్‌వార్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ జైషే మహమ్మద్ ఉగ్రవాది సైఫుల్లా సహా ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. గత ఐదేళ్లుగా కశ్మీర్‌లో అలజడి సృష్టిస్తున్న సైఫుల్లా, సుమారు 20 సార్లు సైన్యం నుండి త్రుటిలో తప్పించుకోవడం గమనార్హం.

ఛత్రూ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. జూలైలో నలుగురు జవాన్ల మరణానికి కారణమైన దాడిలో సైఫుల్లా ప్రధాన సూత్రధారి. ఘటనా స్థలిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు, ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *