ది కేరళ స్టోరీ 2 బీఫ్ వివాదంపై ప్రకాష్ రాజ్ సంచలన కౌంటర్
February 23, 2026

ది కేరళ స్టోరీ 2 ట్రైలర్‌లో బలవంతంగా బీఫ్ తినిపించే దృశ్యంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
అన్ని రకాల ఆహార పదార్థాలు కలిసి ఉండటమే అసలైన కేరళ స్టోరీ అని ఆయన పేర్కొన్నారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరియు కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఈ సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 27న విడుదల కానుంది.