సీబీఎస్ఈ 12వ తరగతి ఫిజిక్స్ పేపర్ కఠినం వ్యవహారం హైకోర్టు గడపకు చేరిన వివాదం
February 24, 2026

ఈ ఏడాది నిర్వహించిన సీబీఎస్ఈ 12వ తరగతి ఫిజిక్స్ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా ఉందంటూ ఉపాధ్యాయుడు ప్రశాంత్ కిరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశ్నలు జేఈఈ స్థాయికి మించి ఉండటంతో పాటు సిలబస్ వెలుపల నుంచి వచ్చాయని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సైతం ఈ పేపర్ పై విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ప్రశ్నపత్రంపై విచారణకు నిపుణుల కమిటీని నియమించాలని, అలాగే విద్యార్థులకు ఊరటనిచ్చేలా గ్రేస్ మార్కులు కలపాలని పిటిషనర్ కోరారు. మూల్యాంకన సమయంలో ఉదారంగా వ్యవహరించకపోతే వేలమంది విద్యార్థుల కెరీర్ ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టు తీర్పు మరియు బోర్డు నిర్ణయంపైనే నెలకొని ఉంది.