పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన

పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒకే మంటపంలో పెళ్లి జరగాల్సిన శోభ మరియు విమల అనే ఇద్దరు ఉపాధ్యాయురాలు విషం తాగి తనువు చాలించారు. శనివారం ఉదయం వీరిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో పెళ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతుల బాబాయ్ యశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా కుటుంబం ఒత్తిడి చేయడమే వారి మరణానికి కారణమని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ వీరి పెళ్లి సంబంధం ఒకటి రద్దయినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఈ విషాద ఘటన వెనుక ఉన్న పూర్తి నిజాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *