ట్రంప్ టారిఫ్ ప్లాన్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇవ్వడంతో నిలిచిపోయిన భారత్ అమెరికా వాణిజ్య చర్చలు

ట్రంప్ టారిఫ్ ప్లాన్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇవ్వడంతో నిలిచిపోయిన భారత్ అమెరికా వాణిజ్య చర్చలు

భారత్ మరియు అమెరికా మధ్య జరగాల్సిన కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పంద చర్చలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. వాషింగ్టన్‌లో ఈ నెల 23 నుంచి 26 వరకు జరగాల్సిన ప్రతినిధుల సమావేశాన్ని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇరు దేశాలు నిలిపివేసాయి. తదుపరి చర్చల తేదీని త్వరలోనే ఖరారు చేయనున్నారు.

మరోవైపు దిగుమతి సుంకాల పెంపుపై అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి అమెరికా సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. అధికార పరిధిని మించి భారీ సుంకాలు విధించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో భారత ఎగుమతిదారులపై పడాల్సిన అదనపు పన్ను భారం తగ్గే అవకాశం కనిపిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *