ఢిల్లీలోని ఆర్మీ మరియు ఎయిర్ఫోర్స్ స్కూళ్లకు బాంబు బెదిరింపులతో తీవ్ర కలకలం
February 23, 2026

దేశ రాజధానిలోని ధౌలా కువాన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ మరియు లోధి రోడ్ ఎయిర్ ఫోర్స్ స్కూళ్లకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ మరియు ఫైర్ సర్వీస్ సిబ్బంది పాఠశాలల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ముందస్తు జాగ్రత్తగా విద్యార్థులను సురక్షితంగా బయటకు పంపి ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో సోదాలు నిర్వహించగా ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ బెదిరింపు ఈమెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.