చంద్రబాబు, బిల్ గేట్స్ భేటీపై వైసీపీ సెటైర్లు.. చాయ్, సమోసా ట్రీట్ అంటూ ఎద్దేవా

అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. దాదాపు మూడు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఏఐ, విద్య, వ్యవసాయ రంగాల్లో సాంకేతిక విప్లవం గురించి చంద్రబాబు, బిల్ గేట్స్ చర్చించారు. అయితే ఈ పర్యటనపై వైకాపా నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
బిల్ గేట్స్ రాక కేవలం చాయ్, సమోసా ట్రీట్ కోసమేనంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసింది. ప్రపంచస్థాయి చర్చలు జరిగినట్లు బిల్డప్ ఇస్తున్నారని, అసలు సమోసా బిల్లు గురించి తప్ప బిల్ గేట్స్ ఏమీ ఆలోచించలేదని ఎద్దేవా చేసింది.
వైసీపీ వ్యాఖ్యలపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రపంచం సాంకేతికంగా ఎంతో ముందుకు వెళ్తుంటే, ఇంకా పాత ఆలోచనలతోనే ఉంటూ వైసీపీ పరధ్యానంలో ఉందని విమర్శిస్తున్నారు. గతంలో చంద్రబాబు, బిల్ గేట్స్ కలిసి చేసిన కృషి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.