రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది.. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్ ఎప్పుడంటే
February 18, 2026

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణతో పాటు మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 ఎంపీ సీట్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు:
- నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: ఫిబ్రవరి 26
- నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 5
- నామినేషన్ల పరిశీలన: మార్చి 6
- ఉపసంహరణకు గడువు: మార్చి 9
- పోలింగ్ మరియు ఫలితాల వెల్లడి: మార్చి 16
రాష్ట్రాల వారీగా ఖాళీలు:
ఈ దఫా అత్యధికంగా మహారాష్ట్రలో 7 స్థానాలు ఖాళీ అవుతుండగా, తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్‌లలో తలో 5 స్థానాలు ఉన్నాయి. అలాగే ఒడిశాలో 4, ఛత్తీస్‌గఢ్‌లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణపై ప్రభావం:
తెలంగాణలో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీ అయ్యే స్థానాలను భర్తీ చేసేందుకు మార్చి 16న ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటించనున్నారు.