పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత నెలకొంది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయన ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. అనారోగ్యం కారణంగా అభిషేక్ బరువు కూడా తగ్గడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఆదివారం ఉదయం వరకు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అనారోగ్యంతో ఉన్న కుమారుడిని చూసుకోవడానికి అభిషేక్ తల్లిదండ్రులు ఇప్పటికే కొలంబో చేరుకున్నారు. ఢిల్లీలో చికిత్స పొందుతున్న సమయంలోనూ వారు ఆయనతోనే ఉన్నారు. ప్రస్తుతం భారత జట్టుతో వ్యక్తిగత ట్రైనర్లు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల తోడ్పాటు అభిషేక్‌కు మానసిక ధైర్యాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మకు విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.