కోటిన్నర ఇస్తే మొగుడిని వదిలేస్తా అంటూ భార్య పెట్టిన షరతుకు ప్రియురాలు గ్రీన్ సిగ్నల్
February 14, 2026

భోపాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సహోద్యోగితో ప్రేమలో పడటంతో తలెత్తిన వివాదం చివరకు కోర్టు మెట్లెక్కింది. ప్రియుడితోనే ఉంటానని సదరు వ్యక్తి తేల్చి చెప్పడంతో అతని భార్య ఊహించని ప్రతిపాదన చేసింది. తన కుమార్తెల భవిష్యత్తు కోసం కోటిన్నర రూపాయల విలువైన డ్యూప్లెక్స్ ఇల్లు మరియు నగదు సెటిల్మెంట్ కావాలని ఆమె డిమాండ్ చేసింది.
ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి ఆ ప్రియురాలు వెనకాడకుండా అంగీకరించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తన ప్రేమ కోసం కోట్లు వెచ్చించడానికి సిద్ధపడిన ఆ మహిళ నిర్ణయంతో కోర్టు సమక్షంలోనే ఈ వింత ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారంతో ముగియడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.