పుల్వామా అమరవీరుల ఏడవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్న భారతావని

పుల్వామా అమరవీరుల ఏడవ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్న భారతావని

2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని జవాన్ల కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ దురదృష్టకర సంఘటన జరిగి నేటికి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నారు.

ఈ దారుణ దాడికి ప్రతికారంగా భారత వైమానిక దళం పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై సర్జికల్ దాడులు నిర్వహించింది. దౌత్యపరంగా కూడా పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు భారత్ కఠిన చర్యలు చేపట్టింది. అమరవీరుల అత్యున్నత త్యాగం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నేటికీ దేశప్రజలు ఈ రోజును ఒక నల్లని రోజుగా పరిగణిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *